రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్‌లో అంతరాష్ట్ర దొంగల ముఠా హల్‌చల్ చేసింది. నగరంలోని పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఒక ఇంట్లో నుంచి ఏడు తులాల బంగారం, 70 తులాల వెండి, 10 వేల నగదు అపహరించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఏడాది క్రితం ఇదే ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ వరుస దొంగతనాలకు పాల్పడింది. దొంగల సంచారం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగల కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
హయత్‌నగర్‌లో దొంగల ముఠా హల్‌చల్.. ఆ గ్యాంగ్ పనేనా..? - అంతరాష్ట్ర దొంగల ముఠా హల్‌చల్
హైదరాబాద్ హయత్‌నగర్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్‌చల్ చేసింది. నగరంలోని పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఒక ఇంట్లో నుంచి ఏడు తులాల బంగారం, 70 తులాల వెండి, 10 వేల నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న చెడ్డి గ్యాంగ్ తిరిగి హైదరాబాద్‌లో చోరీలకు తెగబడుతున్నారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కుంట్లూరు ప్రజాగుల్మహార్‌లో చెడ్డి గ్యాంగ్ కలకలం రేపుతోంది. వరుసగా నాలుగు ఇళ్లలో చోరీ చేశారు. ఈ నాలుగు ఇళ్లలో దొంగతనానికి ముందు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కాగా.. విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో 7 తులాల బంగారం, 70 తులాల వెండి, 10వేల నగదును దొంగలు అపహరించారు.
ఇవీ చదవండి: