మతి స్తిమితం లేని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో జరిగింది. మృతురాలి సవతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జిల్లాలోని పోచంపల్లి గ్రామానికి చెందిన దయ్యాల స్రవంతి (32) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మానసిన పరిస్థితి సరిగా లేకపోవడంతో భర్త కుమార్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త తెలిపారు.