మానసిక పరిస్థితి సరిగాలేని ఓ వ్యక్తి ప్రభుత్వం వరద బాధితులకు ఇచ్చిన రూ. 10 వేలు తనకు అందలేదని చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సికింద్రాబాద్లోని తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగింది.
ఆత్మహత్యకు యత్నించిన మతిస్థిమితం లేని వ్యక్తి - మతి స్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మతిస్థిమితంలేని ఓ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు అందిస్తున్న పరిహారం తనకు అందలేదని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడికి చికిత్స అందించి ఇంటికి పంపించారు.
సికింద్రాబాద్లోని హస్మత్ పేట్ అంజయ్య నగర్ బస్తీకి చెందిన మల్లేశ్ గురువారం మధ్యాహ్నం తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఇచ్చిన రూ. 10 వేలు తనకు అందలేదని ఆరోపిస్తూ.. చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు . గమనించిన తహసీల్దార్ మాధవి రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడికి ప్రాథమిక చికిత్స చేయించారు . ఈ విషయం తెలుసుకున్న బస్తీ పెద్దలు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. మల్లేశ్ మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పడంతో అతడికి చికిత్స అందించి వారితో పంపించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోవడం వల్ల కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:తక్కువ ధరకే కారు అంటారు.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తారు