తెలంగాణ

telangana

ETV Bharat / crime

SUICIDE: తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇంజినీరింగ్​ విద్యార్థిని ఆత్మహత్య - medchal district crime news

తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఓ ఇంజినీరింగ్​ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మేడ్చల్​ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

SUICIDE: తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇంజినీరింగ్​ విద్యార్థిని ఆత్మహత్య
SUICIDE: తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇంజినీరింగ్​ విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Sep 18, 2021, 5:27 AM IST

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడలో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్​ చదువుతున్న మాధవి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. జనగామ జిల్లా లింగాల ఘనపురం ప్రాంతానికి చెందిన కొయేటి మాధవి మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్​లో ఉంటోంది. అయితే 15 రోజుల క్రితం మాధవి తండ్రి చనిపోయారు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉన్న మాధవి.. రెండు రోజుల క్రితం హాస్టల్​కు వచ్చింది.

శుక్రవారం సాయంత్రం తన రూమ్​మెట్స్ బయటకు వెళ్లగా.. మాధవి రూమ్​లోనే ఉండి తన తండ్రి మరణాన్ని తలచుకుని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే గదిలోని ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తోటి స్నేహితులు గదికి తిరిగి వచ్చి చూసేసరికి ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించింది. వారు వెంటనే చుట్టు పక్కల వారికి విషయం చెప్పారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: NCRB: నేరాల విచారణలో తెలంగాణ ముద్ర

ABOUT THE AUTHOR

...view details