తెలంగాణ

telangana

ETV Bharat / crime

టీకా ఇస్తామంటూ... బంగారం ఎత్తుకెళ్లారు - medak district news

కరోనా టీకా ఇస్తామంటూ ఓ వృద్ధురాలి మెడలో నుంచి బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

old women gold theft
బంగారు దోచుకేళ్లారు

By

Published : Apr 9, 2021, 4:05 AM IST

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో కరోనా టీకా పేరుతో వృద్ధురాలు మెడలో నుంచి బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. బోనకుర్తి రామమ్మ అనే వృద్ధురాలు గత కొన్నేళ్లుగా అల్లాదుర్గం మండల కేంద్రంలో ఒంటరిగా జీవిస్తుంది. ఈమెకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలున్నారు. అయినా ఆమెను ఎవరు పట్టించుకోవడం లేదు.

తాజాగా గుర్తు తెలియని ఓ మహిళ ఆమె ఇంట్లోకి వచ్చి కరోనా టీకా ఇస్తామంటూ నమ్మబలికింది. ఈ టీకా ఇస్తే కళ్లు తిరుగుతాయని చెప్పి ఆ వృద్ధురాలి కళ్లకు గంతలు కట్టింది. టీకా ఇస్తున్నట్లు నటిస్తూ వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును కత్తిరించుకుని అక్కడి నుంచి జారుకుంది. వృద్ధురాలు తేరుకుని బయటకుచ్చి కేకలు వేయటంతో ఇరుగు పొరుగు వారు వచ్చి ఏమైందని ఆమెను ప్రశ్నించారు. జరిగిన విషయాన్ని వారికి తెలిపింది. కేసు నమోదు చేసుకున్న అల్లాదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:భార్యను సజీవదహనం చేసిన వ్యక్తికి ఉరిశిక్ష

ABOUT THE AUTHOR

...view details