తెలంగాణ

telangana

ETV Bharat / crime

మున్సిపల్ ఛైర్మన్ సోదరుడి దౌర్జన్యం.. ఓ వ్యక్తిపై దాడి - Aminpur Municipal Chairman latest news

సామాజిక మాధ్యమాల్లో అనుచిత వాఖ్యలు చేశాడంటూ ఓ వ్యక్తిపై అమీన్‌పూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ పాండురంగారెడ్డి సోదరుడు దాడి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sai Kumar
సాయి కుమార్

By

Published : May 3, 2022, 4:43 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ పాండురంగారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని సాయికుమార్ అనే వ్యక్తిపై ఆయన సోదరుడు దాడి చేశారు. ప్రభుత్వ భూమిని ఛైర్మన్ ఆక్రమిస్తున్నాడని సాయికుమార్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేసిన ఛైర్మన్​కి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని అందులో ప్రశ్నించాడు.

దీంతో ఛైర్మన్‌ సోదరుడు ప్రతాప్‌రెడ్డి, కుమారుడు రుశ్వంత్‌రెడ్డిలు మరికొంత మందితో కలిసి సాయికుమార్‌ను కత్తితో బెదిరించి అతనిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. దీనిపై అతను అమీన్‌పూర్‌ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ప్రతాప్‌రెడ్డి, రుశ్వంత్‌రెడ్డిలతో పాటు మిగతా వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో ఛైర్మన్ పాండురంగారెడ్డిపై అనుచిత వాఖ్యలు చేరంటూ ఫిర్యాదు అందడంతో సాయికుమార్‌పై కూడా కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details