సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలి భర్త శిఖామణి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయిచడం కలకలం సృష్టించింది. 15రోజుల క్రితం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. అమీన్పూర్ మున్సిపాలిటీ చెందిన ఓ కోఆప్షన్ సభ్యురాలి భర్త శిఖామణి తన బంధువులకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈవిషయాన్ని గమనించిన సదరు మహిళ భర్త రాజు వారి బాగోతాన్ని వీడియోలు తీశాడు. ఈవిషయం తెలుసుకున్న శిఖామణి తన అనుచరులను పంపించి రాజును కిడ్నాప్ చేయించాడు. అతని వద్ద ఉన్న వీడియోలను తీసివేయించి రాజును విడిచిపెట్టారు. ఈఘటన 15రోజల క్రితం జరగగా బాధితుడి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.