Ambulance Theft: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రాంతీయ ఆసుపత్రి ముందు పార్క్ చేసిన అంబులెన్స్‌ను గుర్తుతెలియని దుండగులు పట్టపగలే మాయంచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పటాన్‌చెరుకు చెందిన సాయికుమార్ అంబులెన్స్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం అంబులెన్స్‌ను ఆసుపత్రి ఎదుట ఉంచి భోజనానికి వెళ్ళాడు.
తిరిగి వచ్చి చూసేసరికి అంబులెన్స్ కనిపించలేదు. వాహనం కోసం చాలాచోట్ల వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించంగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.