వేగంగా వచ్చిన అంబులెన్స్ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.
తనికెళ్ళ గ్రామానికి చెందిన తిరుపతిరావు.. కొనిజర్లలో నిత్యావసరాలు కొనుగోలు చేసి బైక్‌పై ఇంటికి తిరిగి పయనమయ్యాడు. ఎదురుగా వస్తోన్న ఓ అంబులెన్స్ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. తొలుత ఘటనకు పాల్పడ్డ అంబులెన్స్‌లోనే ఆక్సిజన్ అమర్చారు. ఆ తర్వాత మరో వాహనంలో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.