Organ donation : రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్‌కు గురైన ఓ మహిళ అవయవాలను దానం చేసి... మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపారు ఆ కుటుంబసభ్యులు. పేరుకు పల్లెటూరిలో ఉన్నా కూడా... అవయవదానంపై అవగాహనతో దానం చేసి మానవత్వం చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన ఎగ్గె సుశీల(47) బతుకు దెరువుకోసం గత 12 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడే పనులు చేస్తూ జీవనం సాగించేవారు. నవంబర్ 28న హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలమైన గాయాలు కావడం వల్ల హైటెక్ సిటీలోని మెడిక్యూర్ హాస్పిటల్లో చికిత్స అందించారు. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధరించారు.
Brain dead woman organ donation: బాధిత కుటుంబసభ్యులకు వైద్యులు ఈ విషయం చెప్పారు. అంతేకాకుండా అవయవదానంపై అవగాహన కల్పించారు. కాగా ఆమె అవయవాలు దానం చేయడానికి ఆ కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. జీవన్ దాన్ సంస్థ సహకారంతో మృతురాలి కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులు దానం చేశారు. రెండు కిడ్నీల్లో ఒకటి నిమ్స్, మరొకటి అపోలో ఆస్పత్రికి తరలించారు. రెండు కార్నియాలను ఎల్.వి ప్రసాద్ కంటి ఆస్పత్రికి అందించారు.
ఇదీ చదవండి:యువ ఇంజినీర్ అవయవదానం- నలుగురి జీవితాల్లో వెలుగు