Suicide Attempt At Assembly: పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. నాంపల్లిలోని అసెంబ్లీ అవరణలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండు పడక గదుల ఇంటి కోసం అధికారులు చుట్టూ తిరిగినా రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అతన్ని గమనించిన అసెంబ్లీ సిబ్బంది కాపాడారు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.
అసెంబ్లీ సిబ్బంది వెంటనే సైఫాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బాధితున్ని ఆటోలో పోలీసు స్టేషన్కు తరలించారు. కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి:Attack on JC: 'జేసీ'పై చేయిచేసుకున్న వ్యక్తి.. ఇంకెన్నాళ్లంటూ..!