నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను ఆదుకోవాలని అఖిల పక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ... స్థానిక అంబేడ్కర్ కూడలిలో భైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇద్దరు యువకులు మృతి చెందారని తెలిపారు. వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
'హాజీపూర్ మృతులకు.. రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి' - telangana news
హాజీపూర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను ఆదుకోవాలని అఖిల పక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ కూడలిలో భైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
హాజీపూర్ మృతులకు న్యాయం చేయాలని డిమాండ్
మృతుల స్వగ్రామం నడింపల్లి గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు రహదారులు దిగ్భందించి రాస్తారోకో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి:బైక్‌ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు యవకులు మృతి