AIMIM Corporator Nephew Murder : హైదరాబాద్ పాతబస్తీలోని లలిత్ బాగ్ కార్పొరేటర్ మేనల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈద్ బజార్ ప్రాంతంలో ఉన్న లలిత్ బాగ్ కార్పొరేటర్ ఆజం షరీఫ్ కార్యాలయంలోకి గుర్తు తెలియని దుండగులు కత్తులతో దూరారు. ఆయన మేనల్లుడు మూర్తుజా అనస్‌పై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంలో ఉన్న బాధితుడిని వెంటనే కంచన్‌బాగ్‌లో ఉన్న ఒవైసీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పాతబస్తీలో పట్టపగలే దారుణం.. కార్పొరేటర్ మేనల్లుడి దారుణ హత్య - Nephew of Lalitabagh corporator was killed
AIMIM Corporator Nephew Murder : పట్టపగలే కార్పొరేటర్ కార్యాలయంలోకి చొరబడి ఆయన మేనల్లుడిపై కత్తులతో దాడి చేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని లలిత్ బాగ్‌లో జరిగింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కార్పొరేటర్ మేనల్లుడు హత్య
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని వివరించారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 19, 2022, 9:43 PM IST