AGRICULTURAL LABORER DIED DUE TO PALM TREE: మృత్యువు ఏ సమయంలో.. ఏ రూపంలో వస్తుందో ఊహించటం చాలా కష్టం. సరిగ్గా ఇలాంటి ఘటనే ఏపీలోని కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. పొలం పని ముగించుకుని.. బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. తాటిచెట్టు పడి.. వ్యవసాయ కూలీ మృతి చెందాడు. కరప మండలంలోని గొర్రిపూడిలో సుబ్బరాజు అనే వ్యయసాయ కూలీ.. పొలం పనికి వెళ్లి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. సరిగ్గా మంత్రాల తూము వద్దకు వచ్చేసరికి తాటిచెట్టు మీద పడి.. తల నుజ్జునుజ్జు కావడంతో.. సుబ్బరాజు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కూలీ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
'టైం బాగోపోవడం అంటే ఇదే'.. తాటి చెట్టు పడి రైతు మృతి - తాటిచెట్టు పడి వ్యవసాయ కూలీ మృతి
AGRICULTURAL LABORER DIED DUE TO PALM TREE: టైం బాగోలేకపోతే తాడే పామై కరుస్తుందంటారు. మరణం ఏ రూపంలో కాటు వేస్తుందో ఎవరూ ఊహించలేరు. సరిగ్గా ఇక్కడ జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న ఓ వ్యవసాయ కూలీపై తాటిచెట్టు పడి మరణించాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
తాటిచెట్టు పడి రైతు మృతి