తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రభుత్వ ఆస్పత్రిలో బాలికపై యువకుడి అసభ్య ప్రవర్తన - నాగర్ కర్నూలు జిల్లా తాజా నేర వార్తలు

మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా కామాంధుల చేతిలో బలవుతున్నారు. తాజాగా ఓ నిందితుడు మైనర్ బాలిక​తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

అసభ్య ప్రవర్తన
అసభ్య ప్రవర్తన

By

Published : Jun 11, 2022, 1:46 PM IST

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా ఆసుపత్రిలో ఓ మైనర్ బాలికపై ధీరజ్‌ అనే యువకుడు శుక్రవారం అర్ధరాత్రి అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నాగర్‌కర్నూలు పట్టణానికి చెందిన ఓ మహిళ ఆరోగ్యం బాగా లేక పోవడంతో మూడురోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు తోడుగా 12ఏళ్ల కుమార్తె ఆసుపత్రిలో ఉంటోంది.

జిల్లా ఆసుపత్రిలో ఓ కాంట్రాక్టర్ కింద పెయింటర్‌గా పనిచేస్తున్న యూపీకి చెందిన 21 ఏళ్ల ధీరజ్ నిన్న అర్ధరాత్రి బాలికను చేయి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ లోపు ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది రౌండ్ వేస్తూ ఉండగా... శబ్దాలు రావడంతో తలుపు తీసి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అతడిపై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు

ABOUT THE AUTHOR

...view details