తెలంగాణ

telangana

ETV Bharat / crime

Accident: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. నలుగురికి గాయాలు - adilabad depot bus accident

తెలంగాణలో వరుస ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. గత పది రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా తూఫ్రాన్​ వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ డిపో ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈఘటనలో నలుగురికి తీవ్రగాయలయ్యాయి.

adilabad depot bus Accident at toopran, medak district
adilabad depot bus Accident at toopran, medak district

By

Published : Jul 28, 2021, 8:04 AM IST

ఆదిలాబాద్ డిపో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా తూఫ్రాన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్​తో సహా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా బస్సు అద్ధాలు ధ్వంసమయ్యాయి. ప్రయాణికులను మరో బస్సులో హైదరాబాద్​కు తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

TS01 Z 0147 నంబరు గల బస్సు ఆదిలాబాద్ నుంచి మంగళవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్​కు బయలుదేరగా.. బుధవారం వేకువజామున 4 గంటల సమయంలో ప్రమాదానికి గురైనట్లు ప్రయాణికులు చెప్పారు.

ఇదీ చూడండి: Rtc Bus Accident : డ్రైవర్​కు మూర్ఛ.. అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం

ABOUT THE AUTHOR

...view details