విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారును ఢీకొట్టి హత్యాయత్నం చేసారంటూ సినీనటి శ్రీసుధ భవానిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుపై శ్రీసుధ అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ బంజారాహిల్స్‌లో శ్యామ్ కె నాయుడుపై చీటింగ్ కేసు పెట్టిన శ్రీసుధ.. బంజారాహిల్స్ కేసుకు, విజయవాడ ఘటనకు లింకులు ఉన్నాయని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఘటన జరిగి ప్రదేశం భవానీపురం పోలిస్ స్టేషన్ పరిధి కావటంతో వన్ టౌన్ పోలీసులు కేసుని భవానీపురం పీఎస్‌కి బదిలీ చేశారు.
హత్యాయత్నం చేశారంటూ సినీనటి శ్రీసుధ ఫిర్యాదు - actress srisudha complaint at bhawanipuram police station
విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్లో తనపై హత్యాయత్నం చేశారని సినీ నటి శ్రీసుధ ఫిర్యాదు చేశారు. కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుపై అనుమానం ఉందన్నారు.
హత్యాయత్నం చేశారంటూ సినీనటి శ్రీసుధ ఫిర్యాదు