తెలంగాణ

telangana

ETV Bharat / crime

బంజారాహిల్స్‌ పబ్‌లో డ్రగ్స్‌.. టాస్క్​ఫోర్స్ దాడిలో పట్టుబడ్డ సెలబ్రిటీలు నిహారిక, రాహుల్..

pub
pub

By

Published : Apr 3, 2022, 12:05 PM IST

Updated : Apr 3, 2022, 10:58 PM IST

12:03 April 03

Banjara Hills Pub Raid: బంజారాహిల్స్‌లోని పబ్‌లో పట్టుబడిన డ్రగ్స్‌..

బంజారాహిల్స్‌లోని పబ్‌లో పట్టుబడిన డ్రగ్స్‌...

Banjara Hills Pub Raid: హైదరాబాద్​ బంజారాహిల్స్ పుడింగ్ అండ్‌ మింక్‌ పబ్‌లో అర్ధరాత్రి కొకైన్‌, గంజా, ఎల్‌ఎస్‌డీ మత్తు పదార్థాలు సేవిస్తూ పెద్ద ఎత్తున పార్టీ జరుగుతుందని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందడంతో డేకాయ్ ఆపరేషన్‌ నిర్వహించారు. పోలీసులను గుర్తించిన యువతీ యువకులు వారి వద్ద ఉన్న మత్తు పదార్థాలను కిటకీల గుండా బయట పారేసి కనిపించకుండా చేశారు. పక్కా సమాచారంతో ఉత్తర మండల, మధ్య మండల, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పబ్‌ను చుట్టుముట్టారు.

పలువురు ప్రముఖుల కుమారులు, కుమార్తెలు:పబ్​లో ఉన్న యువతీ యువకులు, నిర్వాహకులు, సిబ్బందితో సహా మొత్తం 148 మందిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. వీరితో పాటు పబ్‌ సమీపంలో ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో నటి నిహారిక, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ సహా పలువురు ప్రముఖుల కుమారులు, కుమార్తెలు ఉన్నారు. పోలీసు అధికారుల పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున 3 గంటల సమయంలో వీరందరిని బంజారాహిల్స్ ఠాణాకు తరలించిన పోలీసులు వారి వివరాలను నమోదు చేసుకుని పంపించారు.

ఇన్‌స్పెక్టర్​పై సస్పెన్షన్​ వేటు: పబ్‌ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహారించిన బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ శివచంద్రను సీపీ ఆనంద్ సస్పెండ్ చేశారు. ఏసీపీ సుదర్శన్‌కు నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ నూతన ఇన్‌స్పెక్టర్​గా ప్రస్తుతం ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్​గా ఉన్న నాగేశ్వర్‌రావును నియమించారు. ఇప్పటికే మాదక ద్రవ్యాల వ్యవహారంలో కఠినంగా వ్యవహారిస్తున్న సీపీ సీవీ ఆనంద్ పశ్చిమ మండలంలో ఉన్న పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వారిపై కేసులు నమోదు చేశాం: పబ్‌లో ఐదు ప్యాకెట్లలో 5 గ్రాముల కొకైన్ లభించిందని వెస్ట్​​ జోన్​ డీసీపీ జోయల్​ డేవిస్​ తెలిపారు. పబ్‌లో ఉన్న అందరి వివరాలు తీసుకున్నామన్నారు. పుడింగ్‌ అండ్‌ మింక్ యజమాని అర్జున్‌, అభిషేక్‌పై కేసులు పెట్టినట్లు వెల్లడించారు. డ్రగ్స్‌కు సంబంధించి జనరల్‌ మేనేజర్‌ అనిల్‌పైన కేసు పెట్టినట్లు చెప్పారు. దర్యాప్తు బాధ్యతలను జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు. పబ్‌లో గుర్తించిన 148 మందిపై నిఘా పెడతామని... డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలితే అరెస్ట్ చేస్తామని అన్నారు.

పరారీలో పబ్ యజమాని: పబ్ నిర్వాహకుడు అభిషేక్, జనరల్ మేనేజర్ అనిల్‌కుమార్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. యాజమాని అర్జున్‌ ఉరమనేని పరారీలో ఉన్నట్లు తెలిపారు. డ్రగ్స్‌ పబ్‌లోకి ఎలా వచ్చాయనే దానిపై వీరిని విచారిస్తున్నారు. సీసీ టీవీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ కోసం ల్యాబ్‌కు పంపించారు. నివేదక వచ్చిన తర్వాత పబ్​లో వినియోగించిన మాదక ద్రవ్యాలకు సంబంధించి పూర్తి వివారాలు తెలిసే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు:

Last Updated : Apr 3, 2022, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details