తెలంగాణ

telangana

ETV Bharat / crime

Tollywood drugs case: ఐదు గంటలుగా సినీనటి ఛార్మి విచారణ.. ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న ఈడీ - charmi attended to ed inquiry

Actress Charmi attended the ED enquiry
Actress Charmi attended the ED enquiry

By

Published : Sep 2, 2021, 10:38 AM IST

Updated : Sep 2, 2021, 4:53 PM IST

10:36 September 02

ఈడీ విచారణకు హాజరైన సినీనటి ఛార్మి

ఈడీ విచారణకు హాజరైన సినీనటి చార్మి

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో తొలిరోజు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను విచారించిన అధికారులు.. నేడు నటి ఛార్మిని ప్రశ్నిస్తున్నారు. మొత్తం 12 మంది సినీ ప్రముఖుల్ని విచారించేందుకు సమాయత్తమైన ఈడీ.. గురువారం రోజున హాజరు కావాలని ఛార్మికి సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో విచారణకు ఛార్మి హాజరు కాగా.. ఈడీ అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నారు. 5 గంటలుగా ప్రశ్నిస్తున్న అధికారులు..  ఛార్మి బ్యాంక్ ఖాతాలకు సంబందించిన వివరాలను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన లావాదేవీల గురించి ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

2017లో డ్రగ్స్ కేసులో ఛార్మి.. ఎక్సైజ్ విచారణ ఎదుర్కొన్నారు. కెల్విన్‌ సమాచారం ఆధారంగా ప్రస్తుతం ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. కెల్విన్‌ నుంచి బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులు సేకరించారు. కెల్విన్, ఇద్దరు అనుచరుల ఫోన్లలో గతంలో లభించిన తారల వివరాల ఆధారంగానే నటులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. 8మంది సరఫరాదారుల బ్యాంకు ఖాతాలు సేకరించిన అధికారులు.. అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.

ఇదీ చదవండి

Last Updated : Sep 2, 2021, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details