Tollywood Drugs Case: నవదీప్, ఎఫ్ క్లబ్ జీఎం విక్రమ్‌ను సుదీర్ఘంగా విచారిస్తున్న ఈడీ
10:58 September 13
నవదీప్, ఎఫ్ క్లబ్ జీఎం విక్రమ్‌ను సుదీర్ఘంగా విచారిస్తున్న ఈడీ
టాలీవుడ్ డ్రగ్ కేసులో సినీ నటుడు నవదీప్, ఎఫ్ క్లబ్ జీఎమ్ విక్రమ్‌ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. నవదీప్, కెల్విన్ మధ్య లావాదేవీలు జరిగాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఎఫ్ క్లబ్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరిగిందనే ఆరోపణలపై ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టిసారించారు. బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అందులో అనుమానాస్పదంగా కనిపించిన వాటికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
కెల్విన్‌ను మరోసారి ఈడీ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించారు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్‌సింగ్, రానా, నందు, రవితేజను విచారించారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, డ్రగ్స్ సరఫరాదారులు కెల్విన్, వాహిద్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు. గత 10 రోజులుగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటులను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.. మూడ్రోజుల విరామం అనంతరం తిరిగి విచారణ చేపట్టారు. ఇవాళ్టి విచారణకు హాజరైన నవదీప్ నుంచి మనీలాండరింగ్‌కు సంబంధించిన వివరాలను ఈడీ రాబట్టే ప్రయత్నం చేస్తోంది.
ఇదీ చూడండి:Tollywood drugs case : ముగిసిన రానా విచారణ.. కెల్విన్‌తో లావాదేవీలపై ఈడీ ఆరా