తెలంగాణ

telangana

ETV Bharat / crime

Dasari Arunkumar Arrest: దాసరి అరుణ్​కుమార్ అరెస్ట్​.. మద్యం మత్తులో ఏం చేశాడంటే..? - దాసరి అరుణ్​కుమార్ అరెస్ట్​

Dasari Arunkumar Arrest: నటుడు దాసరి అరుణ్​కుమార్​పై డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసు నమోదైంది. మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతూ.. రెండు ద్విచక్రవాహనాలను ఢీకొన్న అరుణ్​కుమార్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Actor Dasari Arunkumar Arrest for drunk and drive and rash driving in banjarahills
Actor Dasari Arunkumar Arrest for drunk and drive and rash driving in banjarahills

By

Published : Jan 20, 2022, 4:02 PM IST

దాసరి అరుణ్​కుమార్ అరెస్ట్​.. మద్యం మత్తులో ఏం చేశాడంటే..?

Dasari Arunkumar Arrest: సినీనటుడు దాసరి అరుణ్‌కుమార్‌పై హైదరాబాద్​ బంజారాహిల్స్‌ పోలీస్​స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇవాళ(జనవరి 20) తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్‌ నెంబర్ 12లోని సయ్యద్​నగర్​.. అతివేగంగా కారు నడుపుతూ రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడు. అక్కడితో ఆగకుండా.. మరింత వేగంతో దూసుకెళ్లాడు. స్థానికుల సమాచారంతో అదే ప్రాంతంలో ఉన్న పెట్రోలింగ్​ పోలీసులు అరుణ్​కుమార్​ కారును.. వెంబడించి పట్టుకున్నారు.

మద్యం సేవించినట్టు నిర్ధరణ..

అరుణ్​కుమార్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అరుణ్​కుమార్​ మద్యం సేవించినట్టు నిర్ధరణ అయ్యింది. మద్యం సేవించి వాహనం నడపటమే కాకుండా.. రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టినందుకు గానూ అరుణ్​కుమార్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. 185, 336 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీ అధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details