Harassing female employee in hyd: మహిళా ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్ మోహన్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ బల్దియా కమిషనర్ లోకేష్‌కుమార్, పబ్లిక్‌హెల్త్ అండ్ మున్సిపల్‌శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు లేఖ రాశారు. అతడిని జీహెచ్‌ఎంసీ నుంచి తొలగించి ప్రాధాన్యం లేని, మహిళల సహచర్యం లేని పోస్టుకు బదిలీ చేయాలంటూ కోరడం చర్చనీయాంశమైంది. కమిషనర్ లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహిళలు లేనిచోటుకు అతడిని బదిలీ చేయండి సార్..
Harassing female employee in hyd: ఏ రంగంలోనైనా మహిళలు భద్రత విషయంలో వెనకపడే ఉన్నాం. కొంత మంది వ్యక్తులు విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందిన వారి మనసులు, వ్యక్తిత్వాలు మారట్లేదు. మహిళలను వేధిస్తునే ఉంటారు. అలానే హైదరాబాద్ జిల్లాలోని మహిళా ఉద్యోగినిపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వేధింపులకు గురి చేశాడు.
మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేసిన ఉద్యోగిపై ఫిర్యాదు
బల్దియాలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్ మోహన్‌సింగ్ తనను వేధిస్తున్నాడంటూ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కె లావణ్య ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీకి ఫిర్యాదు చేసింది. కమిటీ దీనిపై విచారించగా.. సంబంధిత ఆరోపణలు వాస్తవాలేనని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టును కమిషనర్‌కు పంపగా.. దాన్ని జత చేస్తూ ఆర్ మోహన్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ లోకేశ్ కోరారు.
ఇవీ చదవండి: