తెలంగాణ

telangana

ETV Bharat / crime

'లైంగిక వాంఛ తీర్చలేదని వృద్ధురాలిని నరికి చంపాడు' - Khammam district latest news

తన లైంగిక వాంఛ తీర్చలేదని వృద్ధురాలిని అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ కిరాతకుడు. ఖమ్మం జిల్లా కారేప్లల్లిలో మహిళ శరీర భాగాలు నరికి తగలబెట్టిన కేసును పోలీసులు ఛేదించారు. ఆమెపై చాలా రోజులుగా కక్ష పెంచుకునే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.

Accused of beheading an old woman in Khammam district
వృద్ధురాలిని నరికి చంపిన నిందితుడు

By

Published : Apr 28, 2021, 10:01 PM IST

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో అజ్మీర నాజీ(69) అనే వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కారేపల్లికి చెందిన ఉపేందర్​ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. ఆమెపై కొన్ని రోజుల నుంచి ఉపేందర్(43) అత్యాచారం చేసేందుకు యత్నించాడని... ఈ విషయాన్ని బాధితురాలు గ్రామంలో తెలిసిన వాళ్లందరికీ చెప్పిందని అన్నారు.

దీన్ని జీర్ణించుకోలేని ఉపేందర్ ఆమెపై కొన్ని రోజులుగా కక్ష పెంచుకున్నాడు. అదను చూసి చీమలపాడు రహదారి వైపు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం వృద్ధురాలి కాళ్లు, చేతులు, తల భాగాలను నరికి వాటిని అక్కడే కాల్చివేశాడు. మొండెం భాగాన్ని మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం తిరులపురం రైల్వే ట్రాక్​పై పడేశాడని పోలీసులు తెలిపారు. వృద్ధురాలి హత్యపై ఆమె కుమారులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌

ABOUT THE AUTHOR

...view details