రిమాండ్‌లో ఉండి పరారైన(escape from police) నిందితుడి కోసం వికారాబాద్ జిల్లా శంకర్‌పల్లి పోలీసులు గాలిస్తున్నారు. వికారాబాద్ శివారులో దారిదోపిడికి పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించగా... రాత్రి కావడంతో అధికారులు జైల్లోకి అనుమతించలేదు. పోలీసులు తిరిగి శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఉదయం నాలుగు గంటల సమయంలో ఏ1 నిందితుడు మహ్మద్ అర్షద్ టాయిలెట్ వెళ్తానని చెప్పి పరారయ్యాడు. నిందితుణ్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. వీరంతా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారని అధికారులు తెలిపారు.
Escape from Police: పోలీసు రిమాండ్‌లో ఉన్న నిందితుడు పరారీ - తెలంగాణ వార్తలు
వికారాబాద్ జిల్లాలో పోలీసు రిమాండ్‌లో ఉన్న నిందితుడు పరారయ్యాడు(escape from police). పరారైన నిందితుడు మహమ్మద్ అర్షద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దారి దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్టు చేయగా... అందులో ఒకరు తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసు రిమాండ్‌లో ఉన్న నిందితుడు పరారీ, శంకర్‌పల్లి పోలీసులు
దారి దోపిడీలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు వ్యక్తులను పట్టుకున్న ఎస్వోటీ పోలీసులు... డీసీపీ ప్రకాశ్ రెడ్డి సమక్షంలో ప్రెస్‌మీట్ పెట్టారు. అదే రోజు రాత్రి ఏ1 నిందితుడు పారి పోయాడు(escape from police). పరారైన నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:Huzurabad Bypoll 2021: ఇలా తయారయ్యారేంటి... డబ్బులు ఇవ్వకపోతే దాడి చేస్తారా?