Sexual Harassment: ఆమె ఒక గృహిణి(32). ముగ్గురు పిల్లలతో ఆనందంగా సాగుతున్న సంసారం. ఏడాది క్రితం ఫేస్బుక్లో రామచంద్రాపురం బీడీఎల్ కాలనీకి చెందిన ఐటీ ఉద్యోగి తల్లా అనూప్‌గౌడ్ (26) పరిచయమయ్యాడు. అతడి వ్యవహారశైలి బాగానే ఉందని నమ్మిన ఆమె అనూప్గౌడ్తో స్నేహం కొనసాగించింది. ఫోన్లోనూ ఇద్దరు మాట్లాడుకొనేవారు.
గతేడాది అక్టోబరులో ఇద్దరూ ఓసారి కలుసుకున్నారు. ఆ సమయంలో సదరు మహిళ ఫోన్‌ను తీసుకొని యూప్ ఇన్స్టాల్ చేసి హ్యాక్ చేశాడు. అందులో ఉన్న వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సేకరించాడు. వాటిని అడ్డుపెట్టుకుని తనతో శారీరక సంబంధం పెట్టుకోమంటూ వేధించటం ప్రారంభించాడు. తన కోరిక తీర్చకపోతే ఫొటోలు, వీడియోలను ఆమె భర్త, స్నేహితులు, బంధువులకు పంపుతానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడు. అప్పటికీ తనమాట వినకపోయేసరికి మరింత రెచ్చిపోయాడు. అసభ్య పదజాలంతో వేధింపులకు దిగాడు. భరించలేని ఆమె అతడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసింది. అయినా కొత్త నంబర్లతో ఫోన్‌చేసి వేధించేవాడు.
దీంతో సదరు గృహిణి పోలీసులను ఆశ్రయించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన హయత్‌నగర్ పోలీసులుయయ నిందితుడిని అరెస్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. మహిళలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ హెచ్చరించారు.