తెలంగాణ

telangana

ETV Bharat / crime

దారి దోపిడీ కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్ - Robbery in Tirupati latest news

Tirupati Robbery Case Updates: ఏపీలోని తిరుపతిలో సంచలనం సృష్టించిన దారి దోపిడీ కేసులో సూత్రధారి, వైకాపా కార్యకర్త కృష్ణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.32.5 లక్షల నగదు, ఓ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. మూడో తేదీన పట్టుబడిన ఏడుగురు యువకులు.. కుప్పంకు చెందిన వైకాపా నాయకుడి ప్రధాన అనుచరులని తెలుస్తోంది.

Tirupati Robbery Case Updates
Tirupati Robbery Case Updates

By

Published : Nov 10, 2022, 3:00 PM IST

Tirupati Robbery Case Updates: ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతిలో సంచలనం సృష్టించిన దారి దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈనెల 3వ తేదీ 35 లక్షల రూపాయల దారి దోపిడీ కేసులో ప్రధాన సూత్రధారి కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.32.5 లక్షల నగదుతో పాటు ఓ రివాల్వర్​ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు.

తిరుపతిలో సంచలనం సృష్టించిన దారి దోపిడీ కేసులో సూత్రధారి వైకాపా కార్యకర్త కృష్ణమూర్తిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ నెల మూడో తేదీన తేదీన శంకర్‌రెడ్డి అనే రియల్టర్‌ వద్ద కృష్ణమూర్తి బ్యాచ్‌ రూ.35 లక్షలు కాజేశారని చెప్పారు. నిందితుడి నుంచి రూ 32.5 లక్షల నగదు.. ఓ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 35 లక్షల రూపాయలు ఇస్తే రూ.70 లక్షల బ్లాక్ మనీ ఇస్తామంటూ... హైదరాబాద్​కు చెందిన రియల్టర్ శంకర్ రెడ్డికి వైకాపా కార్యకర్త కృష్ణమూర్తి వల వేశారని అన్నారు.

ఇందుకోసం ముగ్గురు మహిళలను ప్రయోగించారని పోలీసులు తెలిపారు. వారి మాయమాటలు నమ్మిన శంకర్‌రెడ్డి ఈ నెల మూడో తేదీన రూ.35 లక్షల డబ్బుతో తిరుపతికి వచ్చాడని చెప్పారు. అప్పటికే కాపు కాసిన కృష్ణమూర్తి ముఠాలోని ఏడుగురు యువకులు.. శంకర్ రెడ్డి కళ్లలో కారం చల్లి డబ్బుల సంచితో పారిపోయారని పేర్కొన్నారు. బాధితుడు శంకర్‌రెడ్డి ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు... చంద్రగిరి మండలం గాదంకి టోల్ ప్లాజా వద్ద నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. వారిచ్చిన సమాచారంతో కుప్పంకు చెందిన సూత్రధారి కృష్ణమూర్తిని అరెస్టు చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కృష్ణమూర్తిపై ఆంధ్రా, కర్ణాటకలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలియజేశారు. వీరందరూ కుప్పంకు చెందిన వైకాపా నాయకుడి ప్రధాన అనుచరులని తెలుస్తోంది.

ఇవీ చదవండి:రుణ యాప్​ల కేసులో మరో ముగ్గురు అరెస్ట్

మహిళ జననాంగాల్లో పైపు చొప్పించి రేప్.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details