మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కట్టెల మండిలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి మంటలు ఎగిసి పడ్డాయి. మంటలను చూసిన స్థానికులు ఫైర్, పోలీసులకు సమాచారం అందించారు.
కట్టెల మండిలో భారీ అగ్నిప్రమాదం - telangana news today
మహబూబాబాద్ కట్టెల మండిలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చి.. మంటలను అదుపులోకి తెచ్చారు.
కట్టెల మండెలో భారీ అగ్నిప్రమాదం
ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, స్థానికులు.. 10 వాటర్ ట్యాంకర్లతో 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు 10 లక్షల నష్టం జరిగిందని కట్టెల మండి యజమాని బొమ్మ వెంకటేశ్వర్లు తెలిపారు. పక్కన ఖాళీ ప్రదేశాన్ని శుభ్రం చేసి వ్యర్ధాలకు నిప్పు పెట్టడంతో గాలికి నిప్పు రవ్వలు కట్టెల మండిపై పడటంతో ప్రమాదం జరిగింది.
ఇదీ చూడండి :అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం