తెలంగాణ

telangana

ETV Bharat / crime

లారీని ఢీ కొన్న పెళ్లి వాహనం.. పలువురికి గాయాలు

అనుకోకుండా వచ్చిన ప్రమాదం పెళ్లింట విషాదాన్ని నింపింది. సంతోషంగా పెళ్లి ముగించుకొని తిరుగుప్రయాణమవుతున్న వారు ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. వరంగల్​ గ్రామీణ జిల్లా వర్దన్న పేట శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.

పెళ్లి వాహనానికి ప్రమాదం

By

Published : May 23, 2021, 8:00 AM IST

పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. వరంగల్​లో ఓ పెళ్లికి హాజరై తిరిగి మహబూబాబాద్ జిల్లా తొర్రూర్​కు వెళ్తున్న క్రమంలో వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట శివారులో పెళ్లి వాహనం శనివారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ ఎద్దును ఢీ కొని అనంతరం ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. చీకటి కావడంతో ప్రమాదానికి గురైన వారు అరుపులు కేకలు వేశారు. క్షతగాత్రులను స్థానికులు టాటా ఏస్​ వాహనం నుంచి బయటకు తీశారు. అందులో ప్రయాణిస్తున్న 12మందిలో పలువురికి స్వల్ప గాయాలు కాగా ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికులతో కలసి జేసీబీ సహాయంతో టాటా ఏసీ వాహనంలో చిక్కుకున్న ఇద్దరినీ బయటకు తీసి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన 8 మంది మహిళలను స్థానిక ఆసుపత్రికి తరలించి పోలీసులు చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి:తెల్లవారితే పెళ్లి.. గుండెపోటుతో వరుడి మృతి!

ABOUT THE AUTHOR

...view details