Road accident in Kamareddy : కామారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి మండలం హసన్‌పల్లి గేట్ వద్ద టాటా ఏస్‌ను ఎదురెదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో మరో 18 మంది గాయపడ్డారు.
ఘోర రోడ్డుప్రమాదం.. ఎనిమిది మంది మృతి, మరో 18 మందికి గాయాలు
17:48 May 08
ఘోర రోడ్డుప్రమాదం.. ఎనిమిది మంది మృతి, మరో 18 మందికి గాయాలు
పిట్లం మండలం చిల్లర్గికి చెందిన 26 మంది టాటాఏస్‌లో సంతకెళ్లి ఇంటికొస్తున్నారు. ఈ క్రమంలో పిట్లం నుంచి నిజాంసాగర్ వైపు ధాన్యం లోడుతో వెళ్లున్న లారీ హసన్‌పల్లి గేట్ వద్ద టాటా ఏస్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో టాటా ఏస్ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. క్యాబిన్లో చిక్కుపోయిన డ్రైవర్‌ను అతి కష్టం మీద పోలీసులు బయటకు తీశారు.
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందారు. ప్రమాదంలో డ్రైవర్ సాయిలు(25), అంజవ్వ(40), ఈరమణి(38), సాయవ్వ(40), లచ్చవ్వ(45), వీరవ్వ (70), నాగమణి(45), ఎల్లయ్య చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు, క్షతగాత్రులంతా చిల్లర్గి గ్రామానికి చెందిన సమీప బంధువులని తెలిపారు.
ఇదీ చదవండి :స్విగ్గీలో కాఫీ ఆర్డర్.. బద్దకంతో డెలివరీ బాయ్ 'స్మార్ట్ ప్లాన్'!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. సింపుల్ విద్యార్హత... రూ.98వేల జీతం!