తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఓఆర్ఆర్‌పై రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి - తెలంగాణ వార్తలు

accident on outer ring road at shamirpet in medchal district
ఓఆర్ఆర్‌పై రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

By

Published : Mar 14, 2021, 9:31 PM IST

Updated : Mar 14, 2021, 10:32 PM IST

21:43 March 14

ఓఆర్ఆర్‌పై రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

మృతుడు కరుణాకర్ రెడ్డి

21:22 March 14

ఓఆర్ఆర్‌పై రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

కారులో మృతదేహాలు

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ వద్ద ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులంతా ఉప్పల్‌ చిలుకానగర్‌కు చెందిన వారు. రవీందర్‌, కరుణాకర్ ‌రెడ్డి కుటుంబాలతో సహా గజ్వేల్‌ వెళ్లి... తిరిగి వస్తుండగా శామీర్‌పేట్‌ బాహ్యవలయ రహదారి వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జనుజ్జయింది. 

ప్రమాదంలో కరుణాకర్‌రెడ్డితో పాటు కారులో ఉన్న ఇద్దరు మహిళలు సరళ, సంధ్య అక్కడికక్కడే మృతి చెందారు. రవీందర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

ఇదీ చదవండి:ఆటోను ఢీకొన్న కంటైనర్... నలుగురు దుర్మరణం

Last Updated : Mar 14, 2021, 10:32 PM IST

ABOUT THE AUTHOR

...view details