తెలంగాణ

telangana

ETV Bharat / crime

LORRY ACCIDENT: కృష్ణా జిల్లాలో లారీ బోల్తా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి - lorry overturned in gannavaram news

ఏపీలోని కృష్ణా జిల్లా కేసరవల్లి కూడలి వద్ద ఓ లారీ బోల్తా(LORRY BOLTHA) పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

accident-in-krishna-district-and-3-members-died
కృష్ణా జిల్లాలో లారీ బోల్తా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

By

Published : Jul 7, 2021, 9:33 AM IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి- సావరగూడెం కూడలి వద్ద ఓ లారీ బోల్తా పడింది. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. లారీ పై భాగంలో కూర్చున్న భార్యాభర్తలు, చిన్నారి దుర్మరణం చెందారు. బిహార్‌ నుంచి బెంగళూరుకు బియ్యం లోడ్‌తో లారీ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. లారీ కింద ఉన్న మృతదేహాలను తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు(29), రాజ్యలక్ష్మీ(25) , రోహిత్(2)లుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకేసారి చనిపోవడంతో బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. లారీని క్లీనర్ నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:ACCIDENTS: నిర్లక్ష్యం చిన్నది.. విషాదం అంతులేనిది

ABOUT THE AUTHOR

...view details