6people died in Alluri Accident: ఏపీలోని అల్లూరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలం బొడ్డగూడెం వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బాధితులు ఛత్తీస్‌గఢ్ నుంచి భద్రాచలం సీతారామచంద్ర స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కారులో ఉన్న మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. మరో ఇద్దరు మృతి చెందారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 8కి చేరింది. మృతులు, క్షతగాత్రులు ఛత్తీస్‌గఢ్ వాసులుగా గుర్తించారు.
ఘోర ప్రమాదం.. కారును ఢీకొన్న లారీ... ఎనిమిది మంది మృతి - అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం
6people died in Alluri Accident: ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలం బొడ్డగూడెం వద్ద లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. కారులో ఉన్న మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కారును ఢీకొన్న లారీ... ఆరుగురు మృతి
కార్తిక పౌర్ణమి సందర్భంగా వివిధ ఆలయాలు తిరుగుతున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 10 మంది ఈరోజు భద్రాచలం నుంచి జగదల్పూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చింతూరు జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరో నలుగురు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో విషమ పరిస్థితిలో ఉన్నారు.
ఇవీ చూడండి:
Last Updated : Nov 22, 2022, 7:25 PM IST