రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వద్ద ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగింది. ఆంధ్రా నుంచి సీఫుడ్‌తో వస్తున్న కంటైనర్(AP39TQ5734)... ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కంటైనర్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. తీవ్ర రూపం దాల్చి లారీ పూర్తిగా తగలబడిపోయింది. డోర్లు లాక్ అవడంతో డ్రైవర్ మృత్యుంజయ, సహ డ్రైవర్ సూర్యకుమార్ బయటకు వచ్చే పరిస్థితి లేకపోయింది.
ఔటర్ రింగ్‌రోడ్‌పై ప్రమాదం... ఇద్దరు సజీవదహనం - డ్రైవర్ సజీవదహనం
నగరశివారులోని అప్ప జంక్షన్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కంటైనర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్, సహడ్రైవర్ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
![ఔటర్ రింగ్‌రోడ్‌పై ప్రమాదం... ఇద్దరు సజీవదహనం accident at rajendranagar orr and driver dead on the spot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11407862-thumbnail-3x2-accidnet.jpg)
వీరి ఆర్తనాదాలు విని కొందరు వాహనదారులు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా అవీ విఫలమయ్యాయి. మంటల్లో చిక్కుకుని డ్రైవర్, సహడ్రైవర్ ఇద్దరూ ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. క్యాబిన్లో ఇరుక్కున్న మృతదేహలని వెలికి తీశారు. లారీ డ్రైవర్ మృత్యుంజయ యాదవ్ మహారాష్ట్రలోని థానేకి చెందిన వ్యక్తిగా, సహ డ్రైవర్ సూర్యకుమార్ ఉత్తరప్రదేశ్ వారిగా గుర్తించారు. కంటైనర్ యాజమాని ఏపీలోని పాలకొల్లుకి చెందిన ఉమామహేశ్వర్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ భాస్కర్ తెలిపారు.
ఇదీ చూడండి:అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో అపశ్రుతి.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి