ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం హుకుంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొనగా.. ముగ్గురు యువకులు మరణించారు. మృతులు ధవళేశ్వరానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలిలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు స్నేహితులున్నట్లు సమాచారం. అర్థరాత్రి స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. యువకుల మృతితో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు... ముగ్గురు మృతి - తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట వద్ద కారు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం హుకుంపేట వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయరహదారిపై విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అర్ధరాత్రి స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు