తెలంగాణ

telangana

ETV Bharat / crime

లారీలు ఢీ: ఒకరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు - డీజీపీ కార్యాలయం గుంటూరు తాజా వార్తలు

ఏపీలోని గుంటూరులోని డీజీపీ కార్యాలయం ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

accident-at-dgp-office-guntur-one-died
లారీలు ఢీ: ఒకరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

By

Published : Mar 9, 2021, 4:34 AM IST

ఏపీలోని గుంటూరులోని డీజీపీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదం అనంతరం ఒక్కసారిగా.. లారీలోంచి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి :మరొకరితో చనువుగా ఉంటుందని అప్​లోడ్​ చేశాడు

ABOUT THE AUTHOR

...view details