Accident kadapa: ఏపీ లోని కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగులో విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు గడపలో కూర్చున్న వారి మీదకు బొలేరో వాహనం వేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.
Accident kadapa: కడప జిల్లాలో వ్యాన్ బీభత్సం.. నలుగురు దుర్మరణం - kadapa latest crime news
Accident kadapa: వారంతా పనులు ముగించుకొని ఇంటి ముందు కూర్చున్నారు. కాలక్షేపం కోసం పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇలా కొంత సేపు గడిచింది. కానీ అనుకోని మృత్యువు వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ఈ ఘటన ఏపీ లోని కడప జిల్లాలో చోటుచేసుకుంది.

కడప జిల్లాలో ప్రమాదం
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా... కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో ఇద్దరు మరణించారు. మృతులు దేవి(27), అమ్ములు(30), కొండయ్య(45), లక్ష్మీదేవి(35)గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Road accidents in Telangana Today: రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి