ACB traps Sub-Registrar: ఏపీ తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ వెంకట వరప్రసాద్ ఇల్లు, కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు. రాజమహేంద్రవరంలోని నివాసంతో పాటు ఆత్రేయపురంలోని కార్యాలయం, అతను ఆస్తులు కలిగి ఉన్న కాకినాడ, గుణదలతో పాటు తెలంగాణలోని మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
ACB traps Sub-Registrar: ఏసీబీ వలలో అవినీతి చేప - అనిశాకు చిక్కిన అవినీతి సబ్ రిజిస్ట్రార్ వార్తలు
ACB traps Sub-Registrar: ఏపీ తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ ఇల్లు, కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ దాదాపు రూ.1.4 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ACB
వెంకట వరప్రసాద్ అతని కుటుంబ సభ్యుల పేరు మీద G+2 బిల్డింగ్, రెండు ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లు, కారు, ద్విచక్రవాహనం, బంగారం, విలువైన గృహోపకరణాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉన్నట్లు అంచనా వేయగా..అందులో దాదాపు రూ.1.4 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అవినీతి అధికారిని రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచనట్లు అనిశా అధికారులు తెలిపారు.
Last Updated : Dec 8, 2021, 8:27 AM IST