తెలంగాణ

telangana

ETV Bharat / crime

అనిశా వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు - acb raids in hyderabad

ACB RIDES IN TELANGANA HIGHER EDUCATION DEPARTMENT
ACB RIDES IN TELANGANA HIGHER EDUCATION DEPARTMENT

By

Published : Mar 3, 2021, 6:24 PM IST

Updated : Mar 3, 2021, 8:53 PM IST

18:11 March 03

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

అనిశా వలకు మరో అవినీతి చేప చిక్కింది. హైదరాబాద్ లక్డీకాపూల్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఓ అధికారి లంచం తీసుకుంటుండగా... అనిశా అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్​గా పని చేస్తున్న బొడ్ల శ్రీనివాస్... ఓ ప్రైవేట్ పాఠశాల అనుమతి కోసం యాజమాన్యం నుంచి రూ. 40 వేలు లంచం తీసుకొనే సమయంలో అనిశా అధికారులు పట్టుకున్నారు. 

ఏడో తరగతి వరకు అనుమతి ఉన్న ప్రైవేట్ పాఠశాలకు 8 నుంచి 10వ తరగతి వరకు అనుమతి ఇవ్వాలంటూ యాజమాన్యం దరఖాస్తు చేసింది. అనుమతి మంజూరు చేయాలంటే... తనకు రూ.40 వేల లంచం ఇవ్వాలని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. అనుమతికి సంబంధించి అన్ని పనులు పూర్తయిన తర్వాతనే డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వాలని కోరాడు. అధికారికి లంచం ఇవ్వడం ఇష్టం లేని యజమాని... అనిశా అధికారులను ఆశ్రయించాడు. పని పూర్తయిందని... కమిషనర్ కార్యాలయానికి వచ్చి డబ్బులు ఇవ్వాలని... శ్రీనివాస్ బాధితుడికి ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పగా... ప్రణాళిక సిద్ధం చేసి బాధితున్ని ముందుగానే పంపించారు. శ్రీనివాస్​ లంచం తీసుకున్న సమయంలో అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న డబ్బును సీజ్ చేసి... శ్రీనివాస్​పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. 

ఇదీ చూడండి: రెన్యూవల్​కు డబ్బులు తీసుకున్నారని పాఠశాల యజమాని ఆరోపణ

Last Updated : Mar 3, 2021, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details