తెలంగాణ

telangana

ETV Bharat / crime

అనిశా వలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి.. ఎక్కడంటే?

ACB Rides in Registration Office: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. బేగంపేట రిజిస్ట్రేషన్​ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మధుసూధన్​ రెడ్డి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు.

ACB officials were scolded while taking bribe
లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు

By

Published : Mar 10, 2022, 10:50 PM IST

ACB Rides in Registration Office: సికింద్రాబాద్​లోని బేగంపేట రిజిస్ట్రేషన్​ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మధుసూధన్​ రెడ్డి రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. అల్వాల్​కు చెందిన తాటికొండ రాజు ఆస్తికి సంబంధించిన పత్రాల విషయంలో రిజిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు.

బాధితునికి లంచం ఇవ్వడం ఇష్టంలేక అనినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీంతో బాధితుడు రూ.15 వేలు ఇస్తుండగా మధుసూధన్​ రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: మంత్రిని అసభ్యకర పదజాలంతో దూషించిన వ్యక్తి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details