తెలంగాణ

telangana

ETV Bharat / crime

అనిశా వలకు చిక్కిన జూనియర్ అసిస్టెంట్​ - acb rides in badradri district

అనిశా అధికారుల వలకు మరో అధికారి చిక్కాడు. ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​ జారీ కోసం రూ.3,500 లంచం తీసుకుంటూ ఓ జూనియర్​ అసిస్టెంట్​ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు.

acb rides at palvancha mro office
అనిశా వలకు చిక్కిన జూనియర్ అసిస్టెంట్​

By

Published : Mar 20, 2021, 3:44 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆనంద్‌మోహన్ చక్రవర్తి అనిశాకు చిక్కాడు. రూ.3,500 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి అరుణ్‌సాయి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు జూనియర్‌ అసిస్టెంట్ ఆనంద్‌మోహన్ రూ.3,500 లంచం అడిగాడు. విద్యార్థి అరుణ్‌సాయి అనిశా అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అధికారులు ఆనంద్‌మోహన్ చక్రవర్తిని డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు.

ఇదీ చూడండి:లైవ్​ వీడియో: బాలుడిపై అడవి పంది దాడి

ABOUT THE AUTHOR

...view details