తెలంగాణ

telangana

ETV Bharat / crime

పర్సంటేజీ అడిగితే.. అనిశాకు పట్టించాడు

చేసిన పనికి బిల్లు రాయమంటే.. లంచం అడిగాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. తాను నిజాయతిగా పని చేస్తే.. లంచమెందుకు ఇవ్వాలి అనుకున్నాడు ఆ గుత్తేదారు. అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అక్రమార్కుని ఆట కట్టించాడు. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌ జలమండలి కార్యాలయంలో జరిగిందీ ఘటన.

By

Published : Apr 9, 2021, 7:58 PM IST

Boduppal water board
అనిశా వలలో జలమండలి అధికారి

హైదరాబాద్‌లోని బోడుప్పల్‌ జలమండలి కార్యాలయంలో.. అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. గుత్తేదారు నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటున్న జీఎం శ్యామ్‌ సుందర్‌ నాయక్‌ను రెడ్​ హ్యండెడ్​గా పట్టుకున్నారు. 19వ డివిజన్‌ పరిధిలో చేసిన పనికిగాను.. శ్రీనివాస్‌ అనే గుత్తేదారు, జీఎంను సంప్రదించాడు. సుమారు రూ. 30 లక్షల బిల్లు రావాల్సి ఉండగా.. దాన్ని మంజూరు చేయాల్సిందిగా శ్యామ్‌ సుందర్​ను కోరాడు.

సంతకం కోసం.. బిల్లులో 15-20 శాతం లంచాన్ని ఇవ్వాల్సిందిగా జీఎం డిమాండ్‌ చేశాడు. గుత్తేదారు ఫిర్యాదుతో.. అనిశా అధికారులు రంగంలోకి దిగారు. తొలి విడతగా 20వేల రూపాయలు లంచం తీసుకుంటుడంగా పట్టుకుని కేసు నమోదు చేశారు. సుచిత్రలోని అతని నివాసంలో మరో బృందం తనిఖీలు చేస్తోందని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిలిపారు.

ఇదీ చదవండి:టీకా ఇస్తామంటూ... బంగారం ఎత్తుకెళ్లారు

ABOUT THE AUTHOR

...view details