ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై హైదరాబాద్ శివారులోని జల్‌పల్లి పురపాలిక కమిషనర్ ప్రవీణ్ కుమార్‌పై గురువారం రోజు అనిశా అధికారులు గురిపెట్టారు. ఆయన నివాసంతో పాటు మున్సిపల్ కార్యాలయం, సమీప బంధువు ఇల్లు, హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు 30న ఏక కాలంలో దాడులు చేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి 11గంటల వరకూ సోదాలు కొనసాగాయి. అనిశా కేంద్ర పరిశోధన విభాగం డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సోదాల్లో దాదాపు 3 కోట్ల 30లక్షల ఆస్తులతో పాటు.. బినామీల పేర్లపై ఉన్న ఆస్తి పత్రాలను అధికారులు గుర్తించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జల్‌పల్లి కమిషనర్ అరెస్ట్.. - ఏసీబీ దాడులు
ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో హైదరాబాద్ జల్‌పల్లి పురపాలక సంఘం కమిషనర్ ఇళ్లు, కార్యాలయాల్లో అనిశా అధికారులు దాడులు చేశారు. బాలాపూర్, హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా విలువైన భూమి పత్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
ACB Raids
హిమాయత్‌నగర్‌లోని ఆయన కార్యాలయం, ఆదర్శ్‌నగర్‌లోని ఒక ఇల్లు, బాలాపూర్ వాసవీ కాలనీలోని ఇంట్లోంచి విలువైన పత్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ స్థానికంగా ఓ స్థిరాస్తి సంస్థకు అనుకూలంగా వ్యవహరించారన్న ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలో ఓ ప్రజాప్రతిధి, అయన అనుచరులు ఏసీబీకి సమాచారం ఇచ్చినట్టు అనుమానం. ఈ క్రమంలో జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చదవండి:
Last Updated : Jul 1, 2022, 9:46 PM IST