మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రెండో పట్టణ ఎస్ఐ భాస్కర్ రావు.. లంచం(Bribe) తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు(అనిశా)చిక్కారు. స్టేషన్ బెయిల్ ఇప్పించేందుకు బాధితుడి నుంచి రూ. 1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
కరీంనగర్ జిల్లా బాహుపేట గ్రామానికి చెందిన అల్లే నవీన్.. తన తండ్రి సత్యనారాయణ, సోదరుడు వేణు 2019 సంవత్సరానికి సంబంధించిన ఓ కేసు విషయంలో రెండో పట్టణ ఎస్ఐ భాస్కరరావును కొద్దిరోజులుగా కలుస్తూ వస్తున్నారు. కేసులో స్టేషన్ బెయిల్ కావాలని అడగడంతో రూ. 2 లక్షలు ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్ చేశారు. రూ. 1.20 లక్షలు ఇవ్వడానికి బాధితుడు నవీన్ ఒప్పుకున్నాడు. తన డ్రైవర్‌కు ఇవ్వాలని ఎస్ఐ చెప్పాడు.
ఈ రోజు ఉదయం ప్రైవేట్ డ్రైవర్ రాజ్‌కుమార్‌కు డబ్బు ఇస్తుండగా అతనిని ఏసీబీ డీఎస్పీ కె. భద్రయ్య, సీఐలు రవీందర్, సంజీవ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్ఐ భాస్కర్ రావు లంచం డిమాండ్ చేసినట్లుగా అనిశా అధికారులు నిర్ధరించారు. ఎస్ఐతో పాటు డ్రైవర్ రాజ్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ భద్రయ్య తెలిపారు.
స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం పల్లె నవీన్ వద్ద నుంచి.. బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ భాస్కరరావు రూ. 2 లక్షలు డిమాండ్ చేశాడు. ఎన్ని సార్లు కలిసినా ఎస్ఐ తగ్గకపోవడంతో రూ. లక్షా 20 వేలకు ఒప్పుకున్నాడు. తర్వాత నవీన్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. డబ్బులిచ్చేటప్పుడు తన డ్రైవర్ చేతికి ఇవ్వాలని ఎస్ఐ చెప్పడంతో అతనికి నవీన్ డబ్బులిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. త్వరలోనే కోర్టులో హాజరు పరుస్తాం. -భద్రయ్య, అనిశా డీఎస్పీ
లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ ఇదీ చదవండి:ప్రగతిభవన్ వద్ద పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం