తెలంగాణ

telangana

ETV Bharat / crime

ACB: రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై - ఏసీబీ తాజా వార్తలు

స్టేషన్​ బెయిల్​ కోసం రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB)కి చిక్కారు జగిత్యాల టౌన్​ ఎస్సై శివకృష్ణ. ఎస్సైతో పాటు అతని డ్రైవర్​ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

si, shivakrishna, pribe, acb
స్సై శివకృష్ణ, ఏసీబీ

By

Published : Jun 17, 2021, 8:24 PM IST

జగిత్యాల టౌన్‌ ఎస్సై శివకృష్ణ వరకట్నం కేసులో 30 వేలు లంచం తీసుకుంటూ అనిశా(ACB) అధికారులకు చిక్కాడు. కొద్ది రోజుల కింద జగిత్యాల పట్టణానికి చెందిన కట్ట మౌనిక అనే మహిళ తన భర్త శివప్రసాద్‌ అతని కుటుంబ సభ్యులు ఐదుగురిపై వరకట్నం కేసు పెట్టింది. ఈ కేసును అప్పుడున్న ఎస్సై విచారించి నిందితులకు స్టేషన్​ బెయిల్‌ మంజూరు చేశారు. ఈ మధ్యే ఆయన బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో కొత్తగా శివకృష్ణ వచ్చారు.

ఈ కేసును తిరగతోడిన ఎస్సై శివకృష్ణ, నిందితులను స్టేషన్​కు పిలిపించాడు. అరెస్ట్‌ చేస్తామంటూ బెదిరించాడు. కేసులో బెయిల్‌ ఇవ్వాలంటే రూ.50 ఇవ్వాలంటూ డిమాండ్​ చేశాడు. చివరకు 30 వేలు ఇస్తామని శివ ప్రసాద్‌ సోదరుడు రాజేశ్‌ ఎస్సైతో ఒప్పందం కుదర్చుకున్నాడు. ఎస్సై డ్రైవర్‌ రవికి రూ. 30 వేలు ఇస్తుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. ఎస్సై శివకృష్ణతోపాటు అతని డ్రైవర్‌ రవిని అరెస్ట్‌ చేసి రిమాండ్​కు​ తరలించినట్లు అనిశా డీఎస్పీ భద్రయ్య తెలిపారు.

ఇదీ చదవండి:WTC: ఫైనల్​లో తలపడే భారత జట్టు ఇదే

ABOUT THE AUTHOR

...view details