తెలంగాణ

telangana

ETV Bharat / crime

ACB Raids: జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారి ఇంట్లో అనిశా సోదాలు - hyderabad news

ACB Raids on GHMC Town Planning Officer house: జీహెచ్​ఎంసీ శేరిలింగంపల్లి పట్టణ ప్రణాళికాధికారి నరసింహరాములు నివాసంలో అనిశా అధికారులు సోదాలు చేపట్టారు. నరసింహరాములపై ఏసీబీకి ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం నాలుగు చోట్ల సోదాలు జరుగుతున్నాయి.

ACB Raids on GHMC Officer house
జీహెచ్​ఎంసీ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

By

Published : Apr 21, 2022, 1:28 PM IST

Updated : Apr 21, 2022, 2:13 PM IST

ACB Raids on GHMC Town Planning Officer house: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి పట్టణ ప్రణాళికాధికారి నరసింహ రాములు నివాసంలో అనిశా సోదాలు నిర్వహిస్తోంది. ఈ తెల్లవారుజాము నుంచి తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. మూసారాంబాగ్‌లోని ఆయన నివాసంతో పాటు శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ కార్యాలయం, బంధువులు, స్నేహితుల నివాసాల్లో మొత్తం నాలుగు చోట్ల అనిశా సోదాలు చేస్తోంది.

అధికారి నరసింహరాములు

సోదాల్లో ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఏమేం ఆస్తులు గుర్తించారనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ముసారాంబాగ్‌లోని శాలివాహన కాలనీతోపాటు కొత్తపేటలోని గ్రీన్‌ హీల్స్‌ కాలనీలోని ఆయనకు సంబంధించిన ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నరసింహ రాములుపై అనిశాకు అనేక ఫిర్యాదులు అందినట్టు సమాచారం.

Last Updated : Apr 21, 2022, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details