తెలంగాణ

telangana

ETV Bharat / crime

ACB caught Sub registrar: రూ.20 వేలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్ - సబ్‌రిజిస్ట్రార్‌

ఓ వెంచర్ రిజిస్ట్రేషన్ కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కాడు. మధ్యవర్తిగా వ్యవహరించిన డాక్యుమెంట్ రైటర్, సబ్‌రిజిస్ట్రార్‌ను అదుపులోకి తీసుకున్న అనిశా అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు.

ACB caught Sub registrar
ఏసీబీకి చిక్కిన యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్

By

Published : Jul 29, 2021, 8:11 PM IST

యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ వెంచర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌.. డాక్యుమెంట్‌ రైటర్‌ ద్వారా డబ్బులు డిమాండ్‌ చేశారు. రూ.20వేలు లంచం తీసుకుంటుండగా డాక్యుమెంట్‌ రైటర్‌ ప్రభాకర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డాక్యుమెంట్‌ రైటర్‌ ప్రభాకర్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడి సమయంలో కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు బయటకు వెళ్లకుండా తలుపులు వేసి సోదాలు కొనసాగించారు.

ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్

ఆలేరు మండలం కొలనుపాక గ్రామ పరిధిలో గల సర్వే నంబరు 424,425,426,440 నందు గల 23 ఎకరాల 29 గుంటల వెంచర్​ 2008లో వేశారు. స్విస్ లైఫ్ గ్రీన్ అవెన్యూలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ లంచం డిమాండ్ చేశారు. చివరికి రూ.20 వేలకు ఒప్పందం కుదుర్చుకుని రిజిస్ట్రేషన్ కోసం వెంచర్ యజమాని డాక్టర్ సత్యం ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పక్కా స్కెచ్ వేసిన అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్​గా సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్​ను పట్టుకున్నారు. అలాగే హైదరాబాద్​లోని సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఏసీబీకి చిక్కిన యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్

ఇవీ చూడండి:

ACB RIDES: రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన డీఎఫ్​వో

TS News: అ.ని.శాకు చిక్కిన జీహెచ్ఎంసీ డీఈ

పాసుపుస్తకం జారీకి రూ.5 లక్షల డిమాండ్‌... అనిశాకు చిక్కిన తహసీల్దారు

ACB RIDE: రెవెన్యూ కార్యాలయాలపై అనిశా దాడులు.. కీలక దస్త్రాలపై దృష్టి

ABOUT THE AUTHOR

...view details