తెలంగాణ

telangana

ETV Bharat / crime

ACB Rides: అనిశా వలలో అవినీతి చేపలు - నల్గొండ జిల్లా తాజా వార్తలు

ACB Rides: మిర్యాలగూడలో ఏసీబీ వలకు విద్యుత్ శాఖ అధికారులు చిక్కారు. లైన్‌మెన్‌ లీవ్ రెగ్యులరైజేషన్ కోసం రూ.2.50 లక్షలు డీఈ లంచం అడిగారు. ఆయన తరపున జేఏవో రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు రెడ్ హ్యాండెడ్​గా పట్టుబడ్డారు.

acb rides
ఏసీబీ దాడులు

By

Published : Mar 22, 2022, 8:57 PM IST

ACB Rides: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏసీబీ వలకు విద్యుత్ శాఖ డీఈ, జేఏవో చిక్కారు. లైన్‌మెన్‌ లీవ్ రెగ్యులరైజేషన్ కోసం రూ.2.50 లక్షలు డీఈ మురళీధర్‌రెడ్డి లంచం అడిగారు. ఆయన తరపున జేఏవో దామోదర్‌ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు రెడ్ హ్యాండెడ్​గా పట్టుబడ్డారు.

మిర్యాలగూడ పట్టణం రెడ్డి కాలనీకి చెందిన గుంటూరు శ్రీనివాస్ 1991 హెల్పర్​గా విద్యుత్ శాఖలో జాయిన్ అయ్యారు. 1997లో లైన్‌మెన్‌గా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో 2004లో ఐదురోజులు తన కుమారుడి వైద్య చికిత్స కోసం సెలవు తీసుకున్నారు. కుమారుని ఆరోగ్య విషయంలో సెలవుదినాలను 350 రోజులు పొడిగించుకుంటూ వచ్చారు. అనంతరం శ్రీనివాస్​కు కొండమల్లేపల్లికి పోస్టింగ్ ఇచ్చారు.

గతంలో సెలవులో ఉన్న 350 రోజుల పనిదినాలను రెగ్యులరైజ్ చేయాలని తద్వారా వచ్చే బెనిఫిట్లను కల్పించాలని శ్రీనివాస్ అధికారులను కోరారు. ఈ అంశం కోర్టు కేసులో ఉన్న దృష్ట్యా తమ పరిధిలోకి రాదని అధికారులు చెప్పారు. దీంతో అతను కోర్టు నుంచి క్లియరెన్స్ తెచ్చుకున్నారు.

దీంతో డీఈ మురళీధర్ రెడ్డి రూ.3 లక్షలు ఇస్తేనే రెగ్యులరైజ్ చేస్తానని డిమాండ్ చేశారు. చివరకు రూ.2.50లక్షలు ఇచ్చేలా శ్రీనివాస్ ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితునికి లంచం ఇవ్వడం ఇష్టంలేక అనినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు జేఏఓ దామోదర్​కు రూ.2లక్షలు బాధితుడు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. పట్టుబడ్డ దామోదర్​తో పాటు, డీఈ మురళీధర్ రెడ్డి, యుడీసీ లతీఫ్​లను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: బస్సు దిగి రోడ్డు దాటుతుండగా.. అలా జరిగిపోయింది..

ABOUT THE AUTHOR

...view details