తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఏసీబీ వలలో ​ సబ్​ రిజిస్ట్రార్​.. అక్రమ సంపాదన ఎంతో తెలుసా? - ts news

ACB Caught Sub Registrar: ఏసీబీ వలకు బాలానగర్​ సబ్ రిజిస్ట్రార్ చిక్కారు. సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ నిజాముద్దీన్ కోటి 8 లక్షల రూపాయల అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు అనిశా అధికారులు తెలిపారు. ఇల్లు, కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు.

ఏసీబీ వలలో బాలానగర్​ సబ్​ రిజిస్ట్రార్​.. అక్రమ సంపాదన ఎంతో తెలుసా?
ఏసీబీ వలలో బాలానగర్​ సబ్​ రిజిస్ట్రార్​.. అక్రమ సంపాదన ఎంతో తెలుసా?

By

Published : Mar 28, 2022, 10:09 PM IST

ACB Caught Sub Registrar: హైదరాబాద్​ బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ నిజాముద్దీన్ కోటి 8లక్షల రూపాయల అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు అనిశా అధికారులు తెలిపారు. నిజాముద్దీన్, అతని కుటుంబ సభ్యుల పేరు మీదు స్థిర చరాస్తులు కొనుగోలు చేసినట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఓ వ్యక్తికి చెందిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడానికి నిజాముద్దీన్ 75వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు.

అనిశా అధికారులు గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన వల వేసి సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్​తో పాటు డాక్యుమెంట్ రైటర్ జియాఉద్దీన్​లను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఆ తర్వాత నిజాముద్దీన్ ఇల్లు, కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తేలింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details