అ.ని.శా. వలలో టీఎస్ ఎస్పీడీసీఎల్ ఏఈ మధుకర్ - acb latest news
11:38 October 13
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఈ
టీఎస్ ఎస్పీడీసీఎల్(TSSPDCL) ఏఈగా పనిచేస్తున్న మధుకర్ అవినీతి నిరోధక(ANTI CORRUPTION BUREAU) శాఖకు చిక్కారు. రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
హైదరాబాద్ నాగోల్లోని బండ్లగూడలో మధుకర్ ఎలక్ట్రికల్ ఏఈగా పనిచేస్తున్నారు. ఓ ఇంటి పనులకు సంబంధించి పూర్తి నివేదిక ఇచ్చేందుకు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ప్రదీప్ రెడ్డి నుంచి మధుకర్ రూ. 15వేలు డిమాండ్ చేశారు. గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ అ.ని.శా అధికారులకు పట్టుబడ్డారు.
ఇదీ చదవండి:KTR: తెరాస అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్.. కేటీఆర్ ఎమన్నారంటే...