ACB raids at FRO: అటవీశాఖలో అవినీతి చేపను అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అనిశా అధికారులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అటవీశాఖ అధికారి శ్యామ్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో వ్యక్తి విరియా నాయక్‌ను కూడా అనిశా అధికారులు పట్టుకున్నారు. టింబర్ డిపో అనుమతి కోసం రూ.80 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కారు. అవినీతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. శంషాబాద్ ఎఫ్‌ఆర్‌వో శ్యామ్ కార్యాలయం, అతని నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. శంషాబాద్ కోత్వాల్‌గూడలో టింబర్ డిపో అనుమతి కోసం లంచం అడుగుతున్నారని సికింద్రాబాద్‌లోని తార్నాకకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి అనిశా అధికారులను ఆశ్రయించారు.
ACB raids at FRO: అటవీశాఖలో అవినీతి చేపలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అనిశా
ACB raids at FRO: మరో అవినీతి అధికారి అనిశా వలకు చిక్కారు. రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా శంషాబాద్ అటవీ శాఖ అధికారి శ్యామ్ కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనికి సంబంధించిన నివాసాల్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు.
అటవీ శాఖ అధికారి శ్యామ్ కుమార్, విరియా నాయక్
Last Updated : May 25, 2022, 4:40 PM IST